భీమ్‌గల్, (ప్రభన్యూస్) : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్ష్షేత్రమైన నింబాచల క్షేత్రంపై కార్తీకమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా, భక్తి శ్రద్దలతో శ్రీ వారి ఆయుధ మైన చక్రస్వాముల వారి కొండ ప్రదక్షిణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా ఘనంగా నిర్వహించారు. ఉదయం తులసీ, విష్ణువుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం, సాయంత్రం పూట హోమము, బలి ప్రధానము జరిపారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తి పారవశ్యంతో భక్త జనులు పాల్గొని స్వామివారి ఆయుధమైన చక్రస్వామి వెంట నడిచారు. ఉత్సవ యోగ సంరక్షణ కొరకు శ్రీ చక్ర స్వాముల వారిచే నింబాచల గిరి ప్రదక్షిణ గావించారు.
ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహునికి కొండపై ఉన్న సీతానగరిపై డోలారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నేడు నిర్వహించనున్నారు. స్వామి వారి శిఖరానికి చేరువలో సీతానగరి ఉంది. అక్కడే శ్రీలక్ష్మీ నరసింహులకు లాలి పాటలు పాడుతూ డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నేడు రాత్రి 8 గంటలకు ఉంటుంది..
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily