Friday, November 22, 2024

TS | భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు..

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : భార్యను హత్య చేసి,పెట్రోల్ పోసి కాల్చివేసిన భర్తకు జీవితకారాగార శిక్షతో పాటు ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల ఇవ్వాల (మంగళవారం) తీర్పు వెలువరించారు. ఇరవై ఐదు పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ నగరంలోని సీతారాం నగర్ లో నివాసుడైన గుద్దల గణేష్ ఇద్దరు భార్యలు మొదటి భార్య నిర్మల కు ఇద్దరు కుమార్తెలు. నిర్మలతో విభేదాల కారణంగా మాక్లూర్ మండలంలోని బొంకన్ పల్లి గ్రామానికి చెందిన రాణిని రెండవ వివాహం చేసుకున్నాడు.

ఆమెకు ఒక కూతురు జన్మించిoది. రాణి ఒక నిజామాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేసేది. భార్య పైన అనుమానం పెంచుకున్న అతను ఆమెను హత్య చేయాలని పథకంపన్ని 4 అక్టోబర్,2022 న ఎల్లమ్మగుట్ట నుండి ఆమెను ఆటోలో మాక్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామ శివారులోకి తీసుకువెళ్లి ఆమెను చీర కొంగుతో మెడ చుట్టు బిగించి హత్య చేశాడు. శవమై గోనె సంచులు వేసి ఆటో నుండి పెట్రోల్ తీసి ,శవంపై చల్లి అగ్గిపుల్లతో నిప్పు పెట్టాడు.

పోలీసుల నేర విచారణలో ఆమె పదహారేళ్ళ కూతురు తల్లి కాలని కాళ్ళని,వాటికున్న మాట్టే లను,ముక్కు పడక,పుస్తెల తాడు ను గుర్తించింది.కోర్టు నేర న్యాయ విచారణలో మొత్తం పదిహేను మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, పద్నాలుగు దృవీకరించుకున్న పత్రాలు,తొమ్మిది వస్తుగత సాక్ష్యాధారాలు పరిశీలించి ముద్దాయి గణేష్ హత్య నేరానికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ జీవిత కారాగార శిక్ష రెండు వేల రూపాయల జరిమాన విధించారు.

- Advertisement -

శవాన్ని కాల్చివేసి సాక్ష్యాన్ని రూపు మాపడానికి ప్రయత్నించిన నేరానికిగాను ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష తో పాటు వేయి రూపాయలు జరిమాన విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని సేషన్స్ జడ్జి సునీత తమ తీర్పులో పేర్కొన్నారు. కన్న తల్లి హత్యకు గురి కావడం తండ్రి కటకటాల్లోకి వెళ్లడంతో ఒంటరి అయిన వారి పదహారు సంవత్సరాల కూతురుకు జిల్లా న్యాయాసేవాధికార సంస్థ తరపున తగిన ఆర్థిక పరిహారం అందించాలని జడ్జి సునీత తమ తీర్పులో సిఫార్సు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement