Thursday, November 14, 2024

NZB | లైసెన్స్ ఆయుధాలు పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి : జిల్లా పోలీస్ కమీషనర్

నిజామాబాద్ (ప్రభ న్యూస్): లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా.. ఏఆర్‌ఎంఎస్‌ లైసెన్సు పొందిన వారు ఆర్‌ఎంఎస్‌ చట్టం 1959లోని సెక్షన్‌ 21 ప్రకారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని తమ లైసెన్సు కలిగిన ఆయుధాలను ఈ నెల 23 లోపు సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో అప్పగించాలని జిల్లా పోలీసు కమిషనర్‌ కల్మేశ్వర్‌ సింఘేనవర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… లైసెన్సు ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయని వారిపై ఏఆర్‌ఎంఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఉత్తర్వుల నుంచి మినహాయింపు కోరుకునే వారు జిల్లా ఏఆర్ ఎంఎస్ స్క్రీనింగ్ కమిటీ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ప్రేమ్ కుమార్, ఇన్‌స్పెక్టర్, సీసీఎస్ ఫోన్ నంబర్ (87125-96820)ని సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement