Wednesday, November 20, 2024

రైతులను ఆదుకుంటాం… అసెంబ్లీ ప్యానల్ స్పీకర్

బాన్సువాడ , మే 1 (ప్రభ న్యూస్): అకాల వర్షంకు నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని ఆదుకుంటామని అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ హనుమంత్ షిండే రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం గ్రామీణ ప్రాంతాల్లోని రైతన్నల కష్టసుఖాలు తెలుసుకోవడానికి పలు గ్రామాల్లో పర్యటించారు. వాజిద్ నగర్ పంట పొలాలను అదేవిధంగా అకాల వర్షంకు నష్టపోయిన వారి రైతులను ధైర్యంగా ఉండాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులతో మమేకమై సుమారు రెండు గంటల పాటు పంట పొలాలను పరిశీలిస్తూ రైతులకు ధైర్యం నింపారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యంను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా విన్నవించడం జరిగిందని రైతులకు వివరించారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేసిందని వివరించాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో త‌మ ప్రభుత్వం పనితీరు రైతులకు సబ్సిడీ, రైతుబంధు, రైతు బీమా ప్రవేశపెట్టి రైతులకు కరెంటు విషయంలో రైతులకు సరిపడా విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనిని అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించాయ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువులు, కుంటలు పూడికలు తీసి రైతులకు రెండు పంటలు పండించుకొని ఆనంద ఉత్సవంతో రైతులు జీవిస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల కన్నీటి బాధలు ఎక్కువగా ఉండేవ‌ని, ప్రస్తుతం రైతుల బాధలు తీర్చే ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాజిద్ నగర్ ఎంపీటీసీ సాయిలు, పుల్కల్ సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి, బారాస మండల అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నాల్చేరి రాజు, బిచ్కుంద మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement