కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా చిరుత సంచరిస్తూ ఎడ్లపై, మేకల మందలపై దాడులు చేస్తూ వస్తుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండలంలోని సోమిర్యాగడ్ తండాలో మేకల మందపై చిరుత దాడి చేసింది. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారంతో ఇబ్బందులు పడుతున్నామని, చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని కోరారు. వారంలో ఇది రెండో సారి మేకలపై దాడి చేయడం అని గుర్తు చేశారు. అధికారులు చర్యలుఏ తీసుకోవాలని కోరారు. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement