Friday, November 22, 2024

మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన దుర్గార్ములు..

నిజామాబాద్‌ దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి సాముహిక అత్యాచారినికి పాల్పడ్డారు నలుగురు యువకులు. యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. . నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్‌ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్ వచ్చిన ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించిన శేఖర్, నవీన్, కరీం అనే యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు.

నిజామాబాద్‌ నగరంలో పుననిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోకి యువతిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు చెబుతున్నారు.. మంగళవారం రాత్రి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ఘటనపై కేసు నమోదు చేశారు నిజామాబాద్‌ వన్‌ టౌన్ పోలీసులు.. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురు యువలకును అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటనపై సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు నిందితులను పట్టుకున్నాం.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాం.. నిందితుల్లో కొందరు యువతిపై అత్యాచారం చేయగా మరికొందరు సహరించినట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీల బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement