Friday, November 22, 2024

మానవీయ విలువల కోసం పోరాడిన మహనీయుడు కుటుంబరావు

నిజామాబాద్, ఫిబ్రవరి ( ప్రభ న్యూస్)23: మానవీయ విలువల
కోసం తుది శ్వాస వరకు పోరా డిన మహనీయుడనీ పరు చూరి కుటుంబరావు వక్తలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు విలువలు చాలా గొప్పవి, ఆ సిద్దాంతాలు ఆయా కుటుం బాలను ఉన్నతంగా నిలబెడతా యనీ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమో క్రసీ పార్టీ నగర కార్యదర్శి (అడ్వకేట్) పరుచూరి శ్రీధర్ తండ్రి పరుచూరి కుటుంబరావు బుధవారం సాయంత్రం అనారో గ్యంతో మరణించారు. ఆయన కళ్ళను ఇతరులకు చూపు నివ్వాలని లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్) వారికి అందజేశారు. గురు వారం ఆయన శరీరాన్ని ప్రభు త్వ వైద్య విద్యార్థుల పరిశో ధనల కోసం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు.

అంతకుముందు మాధవ నగర్ లోని వారి నివా సంలో ఏర్పాటు చేసిన సభలో మాధవ నగర్ గ్రామ పెద్దలు, ఆయన స్నేహితులు, వివిధ వామపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కుటుంబరావు బామర్ది అయిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు హాజ రై మాట్లాడరు. చివరి వరకు కుటుంబరావు తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్దతో ఉంటూ గ్రామంలో తారత మ్యాలు లేకుండా ఏ సమస్య వచ్చినా నిక్కచ్చిగా నిలబడి తప్పును తప్పని న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడే వారని తెలిపారు.ఒక సందర్భంలో మనసు నొప్పిం చుకున్న వాళ్లకు తర్వాత వారికి ఏది న్యాయబద్ధంగా ఉందో అర్థం చేసుకుంటే చాలు అనే వారని అన్నారు. ఏది న్యాయ మైన నిర్ణయం అయితే అదే నిర్ణయం చేసేవారని కొనియా డారు. అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా వామపక్ష భావజాలానికి పరి చయం చేసి ఆదర్శంగా తమ పిల్లలను తీర్చిదిద్ది వామపక్ష పార్టీలో పనిచేసే విధంగా, నిలబడే విధంగా ప్రోత్సహిం చినటువంటి గొప్ప వ్యక్తి అని తెలిపారు. మేధావుల కన్నా మేదస్సు ఎక్కువ కలిగిన మహా గొప్ప వ్యక్తి మాధవ నగర్ లెజెం డ్ కుటుంబరావు అని అన్నారు

.కమ్యూనిస్టు విలు వలు చాలా మహోన్నతమై నవని హిమాలయ శిఖరాల కన్నా ఉన్నతమైనవని అలాంటి ఉన్నతమైన విలువల కోసం బావగారైన కుటుంబరావు దగ్గ రే నేను రాజకీయాలు నేర్చుకు న్నానని అన్నారు. నేను ఎన్నికలు పోటీ చేసే ముందు నామినేషన్ దాఖలు చేయడా నికి వెళ్లే ముందు కుటుంబ రావు ఆశీర్వాదం తీసుకో వడానికి వచ్చినప్పుడు నిన్ను నమ్మి ఎన్నుకున్న ప్రజల వైపు నిలబడాలని నన్ను ఒక చెంప దెబ్బ వేసి(గుర్తు ఉండటం కోసం) నామినేషన్ కు పంపిం చేవారని తెలిపారు.ప్రజల పక్షాన నిలబడినప్పుడే నీకు విలువ దక్కుతుందని చెప్పే వారని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి సభా అధ్య క్షత మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రె పాటి మాధవరావు వహించా రు. న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట రామయ్య, సిపిఎం సీనియర్ నాయ కులు స్నేహితుడు అన్నే నారాయణరావు, జిల్లా కార్యద ర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఐ నాయ కులు కంచర భూమయ్య, కుటుంబరావు తమ్ముడు బోసు బాబు కూతురు సంధ్య కుమారుడు శ్రీధర్ మురళి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కళాశాలలో కుటుంబరావు భౌతిక కాయా న్ని అందజేశారు.ఈ కార్యక్ర మంలో వివిధ రాజకీయ పార్టీ ల జిల్లా రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు ప్రజాసంఘాల నాయకులు కుటుంబరావు బంధువులు కుటుంబ సభ్యులు మాధవ నగర్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement