Friday, November 22, 2024

ప‌ల్లెల అభివృద్ది కోసం కేసీఆర్ కృషి : ఎమ్మెల్సీ క‌విత

ప‌ల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలోని దేశాయిపేట గ్రామంలో నిర్వ‌హించిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదని క‌విత పేర్కొన్నారు. ప‌ల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంద‌నే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ప‌ల్లెల అభివృద్ధి కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌న్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ప్రారంభించారని క‌విత తెలిపారు. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని.. అయినా కూడా, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు లాంటివి ఎక్కడా ఆగలేదని క‌విత స్ప‌ష్టం చేశారు. కరోనాతో మూడేండ్లు ఇబ్బంది పడ్డా, ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆగలేదన్నారు. ఒక ఇళ్లు ఎలా పరిశుభ్రంగా ఉంటుందో, పల్లె కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement