కామారెడ్డి, ప్రభన్యూస్… జిల్లాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో గల జయశంకర్ కాలనీ, స్నేహపురి కాలనీ లో గల మూడు ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 21 తులాల బంగారం, 2 . 15 లక్షల నగదు, ఒక ఎల్ఈడి టీవీ ని దుండగులు దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఏస్పీ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారంగా దుండగుల వేలిముద్రలు సేకరించారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీ లో నివాసముండే వెంకటేశ్వరులు, జయశంకర్ కాలనీకి చెందిన భాస్కర్, కొండల్ రెడ్డి ల ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో దాచిన 21 తులాల బంగారం, 2 .15 లక్షల నగదును, ఒక ఎల్ఇడి టీవీ ని దుండగులు ఎత్తుకెళ్లి నట్లు తెలిపారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దొంగతనం కు సంబంధించి ప్రత్యేక పోలీసు టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దొంగతనం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ నరేష్ సిసిఎస్ పోలీస్ అధికారులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.