కామారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డిలు రాజీనామా చేశారు. వారితో పాటు 16వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీ,
బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్, బీసీ సెల్ సెక్రటరీ బల్ల శ్రీనివాస్, యూత్ వైస్ బండారి శ్రీకాంత్ లు పార్టీకి యూత్ కమిటీ పదవులకు రాజీనామా చేశారు.
ఇమ్రాన్, వేణు, చేవెళ్ల రాజులు సూర్య బాయ్ యూత్, బీఆర్ ఎస్ సభ్యత్వం కు రాజీనామా చేశారు. గడ్డం సురేందర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మంగళవారం హైదరాబాదులో చేరారు. వీరికి రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.