Monday, November 25, 2024

NZB: ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కాయితి లంబాడీల రాస్తారోకో

పేద్ద కొడప్ గాల్ (కామారెడ్డి) : లాభన(కాయితి) లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద కొడప్ గల్ మండలంలో కాయితి లంబాడీలు బేగంపూర్ గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు ధర్నా చేయడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం లంబాడీలకు మాత్రమే పోడు భూములకు పట్టాలిచ్చిందని, తాము కూడా ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నామని ఈ భూములకు కూడా పోడుపట్టాలి ఇవ్వాలని కాయితి లంబాడీలు డిమాండ్ చేశారు. దీంతో పాటుగానే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి బీసీల నుండి తమను ఎస్టీలోకి కలపాలని నినాదాలు చేస్తూ సుమారు అరగంటకు పైగా లంబాడీలు హైవేను దిగ్బంధించారు. విషయం తెలుసుకున్న పెద్ద కొడప్ గల్ ఎస్సై కోనరెడ్డి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. కాసేపు రహదారిపై లేవమంటూ గిరిజనులు మొరాయించారు.. దీంతో మరొక సారి పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. పేద్ద కొడప్ గల్ మండలంలో కయితి లంబాడీల సంఖ్య అధికంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement