Friday, November 22, 2024

కడెం ప్రాజెక్టుకు మ‌ళ్లీ పోటెత్తిన వరద

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 19,714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిడటంతో అధికారులు 18,011 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రస్తుతం 697.47 అడుగుల వద్ద నీరు ఉన్నది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో క్రస్టు గేట్లన్నీ ఎత్తినప్పటికీ ఆనకట్టపైనుంచి నీరు ప్రవహించింది. ఒక దశలో ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం జరుగుంతా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వర్షాలు తగ్గిపోవడంతో వరద కూడా క్రమంగా నిలిచిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement