Tuesday, November 19, 2024

NZB | వైద్యం కోసం వస్తే నగలు చోరీ… ఆలస్యంగా వెలుగులోకి

నిజామాబాద్ ప్రతినిధి (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని సూర్యనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అస్తస్థతకు గురి కావడంతో ఈనెల 8న చికిత్స నిమిత్తం ఖలీల్‌వాడిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా మహిళ చికిత్స పొందుతుండగా మహిళ మెడలోంచి సుమారు మూడు తులాల బంగారం చోరీకి గురైంది.

నగలు చోరీ విషయమై ఆరా తీసి.. చోరీ విషయమై బాధితులు పోలీసులకు సమా చారం అందించారు. ఆస్పత్రి యజమాన్యం ఆసుపత్రికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని పోలీసులకు అందించినట్లు సమాచారం. ఆదివారం చోరీ ఘటన జరగగా సోమవారం ఆసుపత్రి లో పని చేస్తున్న నర్స్ ను అదుపులోకి తీసుకు న్నట్ల తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement