Friday, September 20, 2024

NZB: మహిళలను కేటీఆర్ తక్కువ చేసి మాట్లాడటం సిగ్గుచేటు… మానాల‌

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 16(ప్రభ న్యూస్) : తెలంగాణలోని మహిళల పట్ల అగౌరవంగా, వాళ్ళని కించపరుస్తూ ఆర్టీసీ బస్సులో బ్రేక్ డ్యాన్సులు చేస్తారని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. జిల్లాకు కేటీఆర్ వస్తే మహిళలు చెప్పులతో కేటీఆర్ ను సన్మానించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… 10 సంవత్సరాలు క్లబ్బులలో గడిపిన కేటీఆర్ కు మహిళలను గౌరవించడం తెలియదన్నారు. మహిళల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. ఎక్కువ దూరం బస్సులో ప్రయాణించే మహిళలు వారి ప్రయాణంలో సమయాన్ని వృధా చేయకుండా దారంతో అల్లికలు చేస్తుంటే మహిళల ఆనందాన్ని చూసి తట్టుకోలేని కేటీఆర్ వ్యంగంగా మాట్లాడడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై మాట్లాడుతూ బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయాలని వారిపై తప్పుగా మాట్లాడారని దానికి నిరసనగా మహిళలు కేటీఆర్ కు చెప్పులతో సన్మా నం చేయడం జరిగిందని ఆయన అన్నారు.

వెంటనే జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు జిల్లా మహిళలకు క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా కేటీఆర్ ను మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి, మహిళా నాయకులు గాజుల సుజాత, మలైకా బేగం, అపర్ణ, మీనా, సంగెం సాయిలు, గోవర్దన్, ప్రమోద్, సంగుభయి, విశాల్, నిఖిల్ రెడ్డి, గౌతం, ఆకుల మధు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement