Thursday, November 21, 2024

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకేనా? : బీజేపీ నేత దినేష్ కులాచారి

నిజామాబాద్ : ఎన్నో ఏళ్లు పోరాడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం కోసం కాదు.. యావత్ తెలంగాణ ప్రజల కోసమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కులాచారి అన్నారు. అదే విధంగా ప్ర‌భుత్వంపై పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం పై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినందుకా.. హరితహారం కార్యక్రమంలో పాల్గొని హరిత తెలంగాణగా తీర్చిదిద్ది నందుకా.. స్వచ్ఛ గ్రామాలు చేసినందుకా… చివరికి న్యాయంగా మాకు రావాల్సిన హక్కులను అడిగినందుకా అని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యుల రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,350 మంది జూని యర్ పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బిజెపి జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కులాచారి మద్దతు పలికారు. ఈ సంద్భంగా బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని ద్వజమెత్తారు. తాటాకుల చప్పులకు భయపడేది లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లు న్యాయమైనవని అన్నారు. బిజెపి పార్టీ వారికి పూర్తిగా అండగా ఉంటుందని వారి సమస్యల సాధనకు ముందుం డి పోరాడుతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేస్తూ జీవో ప్రకటించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement