నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 14(ప్రభ న్యూస్) : బంగ్లాదేశ్ లో అరాచకాలు, హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఇందూర్ నగర బంద్ విజయవంతమైంది. నిజామాబాద్ నగరంలోని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు సహకరించారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… బంగ్లాదేశ్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై అనేక దాడులు జరుగుతున్నా.. ఈ దేశంలో సెక్యూలర్ అని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదుష్టకరమన్నారు. కేవలం హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకునే మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్ధ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లకు కారకులై ఈ దేశ విచ్చిన్నాన్ని కోరుకుం టున్నారన్నారు.
హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా ఇందూర్ ఐక్యవేదిక బంద్ పిలుపుమేరకు నగరంలో శాంతియుతంగా విద్యసంస్థలు, వర్తక, వ్యాపార సంఘాల వారు అందరూ స్వచ్చందంగా బంద్ కు సహకరించడం జరిగిందని, అందరికీ ప్రతేక ధన్యవాదములు తెలిపారు.
పోలీసుల అక్రమ అరెస్టులపై ఎమ్మెల్యే మండిపాటు…
పోలీసులు ఉదయం నుండి శాంతియుతంగా జరుగుతున్న బంద్ వాతావరణాన్ని అక్రమ అరెస్ట్ లతో కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంపై మండిపడ్డారు. బేషరతుగా విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ్ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.