Friday, November 22, 2024

అనుమతుల‌తో అక్రమ ఇసుక రవాణా..

బాన్సువాడ : కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. పుల్కల్ గ్రామంలో ఇచ్చిన అనుమతులను ఆసర చేసుకొని వే బిల్లులు లేకుండా కాంట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. మంగళవారం గ్రామస్తులు అక్రమ రవాణా పై మండిపడ్డారు. ఇసుక రవాణాకు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేయడమేమిటని గ్రామస్తులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుకను తరలించేది లేదంటూ లారీలకు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా లారీలను లోపలికి వెళ్ల నిచ్చేది లేదంటూ ట్రాక్టర్ కేజివీల్స్ అడ్డుపెట్టారు. మంజీరా నదిలో ప్రైవేట్ పట్టాల పేరిట ఇసుక రవాణాకు అనుమతులు పొంది ప్రభుత్వ మంజీరా నదిలో ఉన్న ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ రవాణాను నియంత్రించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement