Friday, November 22, 2024

చికిత్స కోసం సర్కారు దవాఖానాకెళ్తే స్పందించలే?.. కలెక్టర్ కు ఫిర్యాదు..

నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి చికిత్స కోసం సర్కారు దవాఖానాకు తీసుకెళ్తే ఎవరు స్పందించలేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నవీపేట మాజీ ఉప సర్పంచ్ తెడ్డు, పోశెట్టి, నవీపేట గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. గురువారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, నవీపేట గ్రామ ప్రజలు కలెక్టరేట్ ఎదుట తమ నిరసనను వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సాయి కుమార్ అనే వ్యక్తి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్ప త్రికి తీసుకెళ్లామని తెలిపారు.

అక్కడ ఆసుపత్రి లో ఎవరు పట్టించు కోలేదని ఆరోపిం చారు. అంతేకాకుండా ఓ ప్రజా ప్రతినిధితో సైతం ఫోన్ చేయించామని పేర్కొన్నారు. 2 గంటల పాటు వైద్యం కోసం నిరీక్షించిన ఫలితం లేదని తెలిపారు. గాయపడి న వ్యక్తి పరిస్థితి విషమించడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు. రాష్ట్ర ప్రభ్యుత్వం కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తే కనీసం నిజామాబాదు ప్రభ్యుత్వ దవాఖానాలో వైద్యులు సిబ్బంది తమ విధులను సరిగా నిర్వర్తించక‌పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సంఘటనలపై వైద్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు విచారణ కమిటీలు వేసినా… కమిటీ బృందం నిజామాబాద్ ఆసుపత్రిలో పరిశీలించిన.. నిజామాబాదు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది తీరులో ఎటువంటి మార్పు లేదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాల మెరు గుదలపై ప్రత్యేక చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, రాకేష్ శ్రీకాంత్, నవీపేట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement