నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 13 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కళాశాల, పాఠశాల బస్సులకు ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తామని జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయ చౌరస్తా వద్ద ఉదయం ఆకస్మాత్తుగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా స్కూల్ బస్సులను తనిఖీ చేసి నిబంధన ప్రకారం పత్రాలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. నిబంధనలను పాటించని రెండు బస్సులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… జిల్లాలోని పాఠశాల, కళాశాల బస్సులు ఫిట్నెస్ పరీక్షలు వెంటనే చేసుకోవాలని సూచించారు. రవాణా శాఖ నిబంధనలు పాటించని విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులపై వేటు తప్పదని తెలిపారు.
- Advertisement -