Sunday, November 24, 2024

సమస్య పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మే

నిజామాబాద్ : రాష్ట ప్రభుత్వం వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూలరైజేషన్ చేయాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కోరారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 250 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్ ఎదుట తమ నిరసనను వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో మా వంతు బాధ్యతగా ప్రతీ కార్యదర్శి భాగస్వాముల మయ్యామని పేర్కొన్నారు. ప్రతి కార్యదర్శి ఎంతో క్రియా శీలకంగా పని చేసారు. అలాగే గ్రామాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు రావడంలో పంచాయతీ కార్యదర్శులమైన కీలక పాత్ర పోషించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 4 సంవత్సరాల గడువు పూర్తి అయినప్పటికి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యూలరైజేషన్ సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు వెలువడ లేకపోవడంపై వాపోయారు.

రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు 13-04-2023 సమ్మె నోటీసు ఇస్తూ 15 రోజుల నోటీసు పీరియడ్ అనంతరం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు చేపడుతామని పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్య దర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ 6.0. విడుదల చేయా లనీ తెలిపారు. గడిచిన 4 సంవ‌త్స‌రాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలనీ,ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ JPS లు గా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబే షన్ పిరియడ్లో భాగంగా పరిగ ణించాలనీ కోరారు. వారి ని కూడా రెగ్యూలర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ని నిర్ధారించి ప్రకటించాలనీ పేర్కొన్నారు.మరణించిన జూనియర్ పంచాయతీ కార్యద ర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకో వాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూల రైజేషన్ చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షులు సుంగా అనిల్, ప్రధాన కార్యదర్శి భానుక చంద్రశేఖర్, కోశాధికారి సుమన్, గౌరవ అధ్యక్షులు హనుమాన్ రాజు, ఉపాధ్యక్షులు హే, కృష్ణవేణి, గౌతమి, బాలకృష్ణ సాయి కుమార్ రామా గౌడ్, సుమారు 250 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement