నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లోని టీ మార్ట్ అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి మాల్ కు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పారు. టీ మార్ట్ అగ్నికి ఆహుతి కావడం వెనుక షార్ట్ సర్క్యూట్ జరిగిందా.. లేక ఎవరైనా నిప్పు పెట్టారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ మార్ట్ అగ్నికి ఆహుతి కావడంతో వస్తు సామగ్రి రెండు కోట్ల వరకు కాలిపోయాయి. భవనం సైతం పనికిరాకుండా పోయింది. స్థానిక పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement