Thursday, November 7, 2024

NZB: ఆగస్టు 15తరువాత ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ తప్పనిసరి.. సీపీ వెల్ల‌డి

నిజామాబాద్ ప్రతినిధి, జులై 27(ప్రభ న్యూస్) : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, లేకుంటే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ శనివారం తెలిపారు.

నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఆగస్టు 15 తరువాత ద్విచక్ర వాహనాదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement