నిజామాబాద్, జులై 20 (ప్రభ న్యూస్) : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు, వాగులు, చెక్ డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులు నీటితో నిండిపోయి అలుగులు పొంగి పొర్లుతున్నాయి. గడిచిన 24గంటల్లో సగటున 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కోటగిరి, రెంజల్, దొంకేశ్వర్, నవీపెట్ మోపాల్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. బోధన్ పట్టణానికి తాగు నీరు అందించే బెల్లాల్ చెరువు పూర్తి స్థాయిలో నీటి తో నిండిపోయింది. మహారాష్ట్రలోని బాలేగాం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ నీరు గోదావరి ద్వారా ఎస్సారెస్పీ లోకి వచ్చి చేరుతుంది.
- Advertisement -