Friday, November 22, 2024

NZB: హెల్త్ కార్డులు.. న్యాయవాదులకు ఆర్థిక ధీమాను కలిగిస్తాయి..

నిజామాబాద్ ప్రతినిధి, జులై 16(ప్రభ న్యూస్): ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆరోగ్య కార్డులు చాలా ఉపయోగ పడతాయని… హెల్త్ కార్డులతో న్యాయవాదులకు ఆర్థిక ధీమాను కలిగిస్తాయని బార్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆరోగ్య కార్డులు చాలా ఉపయోగపడతాయన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు హెల్త్ కార్డులను బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్, అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యురాలు పరిపూర్ణ రెడ్డితో కలిసి అందజేశారు.

మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి దొన్పల్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ… ప్రతి న్యాయవాదికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులకు గురికావద్దనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్స్ వెల్పేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందజేయడం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి సంవత్సరం కార్డులను రెన్యూవల్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అడ్వొకేట్స్ వెల్పేర్ ట్రస్ట్ రాష్ట్ర సభ్యురాలు పరిపూర్ణ మాట్లాడుతూ… ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఒకవేళ అనారోగ్యానికి గురైన వారికి రెండు లక్షల రూపాయల వరకు ఉచిత భీమా సౌకర్యం కల్పించడం హెల్త్ కార్డుల పంపిణీలో ఉన్న ముఖ్యమైన ప్రయోజనమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్ ఎ దీపక్ అయ్యూబ్, చెలిమెల రాజేశ్వర్, కుమార్ దాస్, సాయిరెడ్డి, మధుసుదన్ రావు, కుంట శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఎల్ శాస్త్రి, కవిత గంగోనే, ఇందుమతి, రజిత, అంజలి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement