నిజామాబాద్ ప్రతినిధి (ప్రభా న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతోనే యువకుడు మృతి చెందాడంటూ బాధితుల ఆరోపించారు. జిల్లాలోని బోధన్ నియోజక వర్గంలోని నవీపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన పిట్ట నారాయణ (38) అనే వ్యక్తి ఈనెల 8న గుండెకు సంబంధించిన సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బంధువులు సదరు వ్యక్తిని నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట వద్దగల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకోవచ్చారు.
ఆస్పత్రిలో సదరు వ్యక్తిని వైద్యులు పరీక్షించి మూడు హోల్స్ బ్లాక్ అయ్యాయి వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన సదరు వ్యక్తి బంధువులు వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్ తో మొర పెట్టుకున్నారు. సర్జరీకి సంబం ధించిన డబ్బుల విషయమై ఆరోగ్యశ్రీ నుండి అప్రూవల్ రాగానే సర్జరీ చేస్తా నని డాక్టర్ చెప్పారు. దీంతో ఈనెల 10న సర్జరీకి సంబంధించిన డబ్బుల విష యమే ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్ వచ్చిందని వెంటనే సర్జరీ చేస్తానని సదరు వైద్యుడు బంధువులకు తెలిపారు.
దీంతో సర్జరీ పూర్తయి సంపూర్ణ ఆరోగ్యంతో మావాడు ఇంటికి వెళ్తారని రోగి బంధువులు ఎంతో సంతోషించారు. కానీ అలా జరగలేదు.. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు సదరు వ్యక్తికి ఈరోజు, రేపు సర్జరీ చేస్తానంటూ కాలయాపన చేశాడనీ బంధువులు ఆరోపించారు. ఒకరోజు ఆపరేషన్ థియేటర్లో లైట్లు పనిచేయడం లేదని ,మరో రోజు ఎన్నికలు ఉన్నాయని మరో రోజు ఆసుపత్రిలో పేషెంట్లు బాగా ఉన్నారని ఇలా రోజుకోఒక సాకుతో సర్జరీ తేదీ కాస్త పొడిగిస్తూ వచ్చాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోగి వైద్యం కోసం ఈనెల 8న ఆసుపత్రికి వస్తే… సర్జరీ చేయాల్సిన ఉండగా.. 8 రోజుల తర్వాత గురువారం ఆస్పత్రిలో వైద్యులు రోగికి సర్జరీ చేశారు. మధ్యాహ్నం సర్జరీ చేసిన అనంతరం వైద్యులు రోగి బందువూలతో మాట్లాడుతూ ఆపరేషన్ విజయవంతం అయింది ధైర్యంగా ఉండాలని రోగి బంధువులకు భరోసా కల్పించారు. కానీ ఆపరేషన్ అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే సదరు రోగి మృతి చెందాడు.
దీంతో రోగి చనిపోయిన విషయాన్ని ఆసుపత్రి యజమాన్యం బంధువులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. దీంతో అనుమానం వచ్చిన రోగి బంధువులు సదరు ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా రోగి చనిపోయారంటూ సమాధాన మిచ్చారని చెప్పారు. దీంతో రోగి బంధువులు కోపోద్రిక్తులై న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేం తవరకు ఇకనుంచి వెళ్ళేది లేదంటూ ఆసుపత్రి ఎదుట అభీష్మించుకొని కూర్చున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
వైద్యుడిగా రోగిని కాపాడేందుకు ప్రయత్నించాం… ప్రవేట్ ఆసుపత్రి వైద్యులు…
చికిత్స కోసం మా ఆసుపత్రికి వచ్చిన సదరు రోగిని కాపా డుకోవడానికి వైద్యాన్ని అందించి శాయ శక్తుల ప్రయత్నించాం. కానీ ఆపరేషన్ పూర్తయిన అనంతరం రోగి మృతి చెందాడు. ఇందులో వైద్యం అందించడంలో మా నిర్లక్ష్యం ఏమీ లేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.