Friday, November 22, 2024

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్ బుయాన్ కు ఘన స్వాగతం

కామారెడ్డి ప్రభన్యూస్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్ కు జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్, జిల్లా జడ్జి శ్రీదేవి, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్ బుయాన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement