మాక్లూర్, ప్రభ న్యూస్ : మాక్లూర్ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురు గాలులతో గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. దీని ప్రభావంతో ఆరబోసిన ధాన్యం నీటిపాలవగా, చేతికొచ్చిన పంట నేలమట్టమైంది. బలంగా వీచిన గాలులకు అక్కడక్కడ చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు వైర్లు తెగి పడి కొన్ని గ్రామాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క తడిసిన ధాన్యాన్ని చూస్తూ తల్లడిల్లిపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement