Tuesday, November 26, 2024

NZB: సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎంతో సంతృప్తి..

నిజామాబాద్ సిటీ, జనవరి 31 (ప్రభ న్యూస్): సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎంతో సంతృప్తినిస్తుందని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య తెలిపారు. ప్రజా ప్రతినిధుల, జిల్లా పాలన యంత్రాంగం, స్నేహ సొసైటి సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతో చేస్తున్న సమాజ సేవలకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యం దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 27న ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ తమిళనాడు బోర్డ్ అడ్వైసర్ మాస్టర్ బాబు విజయన్, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మనొ కరన్, ఆంధ్ర ప్రదేశ్ రిటైర్డ్ న్యాయమూర్తి హరిదాస్, అంకలజీ దెరపిస్ట్, డాక్టర్ శివప్ప కె.పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, నాన్సీ మంజుల విమల సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గౌరవ డాక్టరేట్ స్నేహ సూసైటి కార్యదర్శి సిద్దయ్యకు రావడంతో స్నేహ సొసైటీ సిబ్బంది అందుల వనరుల కేంద్రం సిబ్బంది, దివ్యాంగుల పాఠశాల సిబ్బంది, నిజామాబాద్ కు చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement