Friday, November 22, 2024

NZB: కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్ మంజూరు..

నిజామాబాద్ ప్రతినిధి, జులై 27(ప్రభ న్యూస్): కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ లో 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకై సహకరించాలని గత రెండు నెలల క్రితం వీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని కోరారు. వెంటనే అదనపు సెక్షన్ మంజూరికై అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కోరిన సంగతి తెలిసిందే. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి, కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకు ఇటీవల అనుమతి ఉత్తర్వులు ఇచ్చారు.

దీంతో సంబంధిత విద్యాలయ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి, అడ్మీషన్ల ప్రక్రియని మొదలుపెట్టారు. అడ్మిషన్ల కోసం మొత్తం 132 దరఖాస్తులు స్వీకరించామని, కేంద్రీయ విద్యాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా, ఈనెల 22వ తేదీన లాటరీ పద్ధతిన అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుందని, మరో వారం రోజుల్లో తరగ తులు ప్రారంభమవుతాయని విద్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా ప్రపోస ల్స్ పంపడంలో ఆలస్యమైన ప్పటికీ , అదనపు సెక్షన్ మంజూరుకు సహక రించినందుకు వీఎంసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement