నిజామాబాద్ సిటీ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో విస్తృతంగా క్షయ నిర్మూలన కార్యక్రమాల్ని నిర్వహించి టీబీని, నూతన క్షయ వ్యాధిగ్రస్తులను 60 శాతం వరకు నిర్మూలించడంతో నిజామాబాద్ జిల్లాకి జాతీయ స్థాయిలో బంగారు పతకo అవార్డు వచ్చింది. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్స వాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారణాసిలో నిర్వహించిన జాతీయస్థాయి ఉత్సవాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుద ర్శనం నిజామాబాద్ జిల్లాలో 60 శాతం నూతన టీబీ వ్యాధి గ్రస్తులని తగ్గించడంతో బంగారు పతకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మనసుకు మాండవీ యం చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్రం నుండి టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, టిబి జిల్లా సమన్వయకర్త రవి గౌడ్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా డిఎం హెచ్ఓ డాక్టర్ ఎం సుదర్శనం మాట్లాడుతూ క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు వరుసగా గత మూడు సంవత్సరాల నుండి జాతీయ స్థాయిలో అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు గతం లో మొదటగా2020 సం” కు గానూ కాంస్య పథకం ఢిల్లీలో, 2021 సంవత్సరం కు రజత పతకం ఢిల్లీలో గత సంవత్సరం 2022 కు బంగారు పతకం వారణాసిలో రావడం జరిగిం దన్నారు. ఇటీవలే టీబి నియంత్రణలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు రావడం జరిగిందన్నారు. నేడుఈ అవార్డుని ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యస్థలం వారణాసి లో నిర్వహించిన కార్యక్రమంలో తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా నిరంతరం పని చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా భవిష్యత్తులో నిజాంబాద్ జిల్లాలో100% నూతన కేసులు నమోదు కాకుండా క్షయ రహిత జిల్లాగా నిజామాబాద్ ని మారుస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇందులో భాగస్వా ములైనట్టి క్షయ నియంత్రణ విభాగ సిబ్బంది, వైద్య సిబ్బం ది, ఆశా కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు రెడ్ క్రాస్,సూర్య హెల్త్ ఆర్గనైజేషన్, ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement