Wednesday, January 22, 2025

NZB | ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ నుడా చైర్మన్ పేరు..

  • అధికారుల సర్వేకు నిలువెత్తు నిర్లక్ష్యం ఇది..
  • అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి
  • ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్..


నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 22(ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 43వ డివిజన్ లో నిర్వహించిన వార్డు సభలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మాజీ నుడా చైర్మన్ భార్య విశాలి రెడ్డి పేరు రావడం చర్చనీయాంశమైంది. బుధవారం నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ లో పాత అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన వార్డుసభ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్ ఇందిరమ్మ కమిటీ చైర్మన్ స్రవంతి రెడ్డి, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఇందిరమ్మ పథకానికి సంబంధించి జాబితా పరిశీలించగా మాజీ నుడా చైర్మన్ భార్య చామకూర విశాలిని రెడ్డి పేరు (రేకుల షెడ్డు) రావడంతో ఆవాక్కయ్యారు.

ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్ స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. 43వ డివిజన్ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా జాగా ఉంది.. ఇల్లు కట్టుకోవడానికి రూ.(ఐదు లక్షల రూపాయలు) సంబంధించి 11మంది ఎంపికైనట్టు తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 485 మంది జాబితాను అధికారులు సర్వే చేసి ఇచ్చారు. ఇందులో స్క్రూట్నీ చేయాల్సి ఉంది. కానీ.. మాజీ నుడా చైర్మన్ భార్య పేరు రావడంపై మండిపడ్డారు. రేకుల షెడ్ లో మాజీ నుడా చైర్మన్ భార్య విశాలి రెడ్డి రేకుల షెడ్డులో నివశిస్తున్నట్టు అధికారులు సర్వే చేయడం వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇది. పారదర్శకంగా నిర్వహించాల్సిన సర్వే అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించి అన‌ర్హుల‌కు లబ్ధి చెందాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

డివిజన్ లో ఎంతోమంది నిరుపేదలున్నారని, అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరుపేదలు బలి కావద్దన్నారు. రేషన్ కార్డు ప్రక్రియలో కూడా అర్హులైన నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

జాబితాలో మాజీ నుడా చైర్మన్ పేరు రావడంపై ఆంధ్రప్రభ న్యూస్ లైన్ మాజీ నుడా చైర్మన్ ని అడగగా… ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు ఇండ్లు కేటాయించాలని ఉద్యమకారులుగా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. విచారణకు వచ్చిన అధికారులకు కూడా ఉద్యమకారుల జాబితాలో మాకు ఇల్లు కేటాయించాలని కోరామని మాజీ నుడా చైర్మన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement