నిజామాబాద్ సిటీ : స్మశాన వాటికలు, ప్రైవేట్ ఆసుపత్రులపై ఉన్న శ్రద్ధ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రభుత్వ దవఖానపై లేదని 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రోహిత్ మండిపడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ బడ్జెట్ లో ఎలాంటి లాభం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రోహిత్ బడ్జెట్ పత్రాలను చింపివేసి నిరసన చేశారు. సోమవారం నగరంలో ఖలిల్వాడిలో గల న్యూ అంబేద్కర్ భవన్ లో నగర మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల హాజరయ్యారు. బడ్జెట్ సమావేశం అనంతరం బడ్జెట్ పత్రాలను చింపివేసి నిరసన చేపట్టిన రోహిత్ మాట్లాడుతూ పేద మధ్యతర గతి ప్రజల పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రవేశపెట్టిన నగరపాలక సంస్థ బడ్జెట్ లో ఎలాంటి లాభం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు కేటాయించాలి కాని.. స్మశాన వాటికలో కోసం అత్యధికంగా నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. స్మశానాలకు, ప్రైవేట్ ఆస్పత్రులపై పెట్టే శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రికి పెట్టకపోవడం దారుణమని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement