నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 788 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,073 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 31.849 టీఎంసీలు. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి 17.782 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement