నిజామాబాద్ ప్రతినిధి, జులై 23(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల శ్రీ మార్ట్ లో ఇవాళ తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే శ్రీ మార్ట్ లోని ముందు భాగం మొత్తం సామాగ్రి కాలి బూడిదైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు.
- Advertisement -