Monday, October 7, 2024

NZB: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం… ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 7(ప్రభ న్యూస్) : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మాజీమంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన నిజామాబాద్ వ్యవ సాయ కమిటీ నూతన కార్య వర్గ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హాందాన్, చైర్మన్ అన్వేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూప తిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్పాగంగారెడ్డి, వైస్ చైర్మన్ గా జంగిటి రామచందర్ లు, పాలకవర్గ సభ్యులు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డబ్బులు రూ.8 కోట్ల రూపాయలు ఇతర జిల్లాలకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి, ఆ రూ.8 కోట్లు వెనక్కి తీసుకువచ్చేలా కృషి చేస్తానన్నారు.

గత 10ఏళ్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షే మమన్నారు. యువతకు నిరుద్యోగ కల్పనకై సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, సొసైటీ చైర్మన్ తారాచార్ నాయక్, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, నగేష్ రెడ్డి, భక్తవత్సలం (ఢిల్లీ) కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement