Tuesday, November 26, 2024

లారీల కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన రైతులు

నాగిరెడ్డిపేట్ : ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని తరలించడానికి లారీలు లేకపోవడంతో మండలంలోని తాండూర్ సొసైటీల పరిధిలో గల కన్నారెడ్డి గ్రామ రైతులు, గ్రామస్తులు హైదరాబాద్, బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాక్ట్ చేసి 20 రోజులు కావస్తున్నా… లారీలు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించేందుకు లారీలను పంపాలని డిమాండ్ చేస్తూ 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులను పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తంచేశారు. తరుగు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వంపై, అధికారులపై మండిపడ్డారు. ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘటనా స్థలానికి డిప్యూటీ ఎమ్మార్వో రామ్ సింగ్, ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని రోడ్డుపై రైతులతో మాట్లాడి అటు వైపు నుంచి వస్తున్న ఒక లారీని ఆపి ఏర్పాటు చేయడంతో రైతులు ధర్నాను విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement