Friday, November 22, 2024

జాతీయ రహదారి సర్వేను అడ్డుకున్న రైతులు..

బోధన్‌, (ప్రభన్యూస్‌) : జాతీయ రహదారి సర్వే పనులను మంగళవారం బోధన్‌ మండలంలో రైతులు అడ్డుకున్నారు, మండలంలోని సాలంపాదు శివారులో పంట పొలాల్లో జాతీయ రహదారి సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అక్కడికి చేరుకొని పరిహారం అంశాన్ని తేల్చాలి అని అడిగారు. రైతులకు పరిహారం గురించి చెప్పాలని అడిగారు ఉదయం సర్వే నిలిచి పోవడంతో విషయం తెలుసుకున్న తహసిల్దార్‌ గఫ్ఫర్‌ మియ్య అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు.

నిబంధనల ప్రకారం పరిహారం ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని చెప్పారు. పట్టాదార్‌ నివేదికలు, భూములు కొల్పొనున్న రైతుల వివరాలు సర్వేలో సేకరించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. సర్వే నెంబర్‌ల వివరాలు సేకరించడం జర్గుతుందన్నారు. భూమి రిజిస్టేషన్‌ విలువ ఆదారంగ పరిహారం ప్రభుత్వం నిర్ణయం చెస్తుందని చెప్పారు. రైతులు అందోళన చెందవద్దని సుచించారు. తాసిల్దార్‌ హామీ మేరకు రైతులు సర్వేకు సహరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement