Tuesday, November 19, 2024

NZB: నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, అనుమతి లేని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి…సీపీ కల్మేశ్వర్

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 7(ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, ఉద్యో గాలు ఇస్తామంటూ అనుమతి లేని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ తెలిపారు. బుధవారం ఆయ‌న మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లు, పలు సంస్థ లు ఉపాధికల్పిస్తామని, వీసా, పాస్‌పోర్టు ట్రావెల్, టూరిజం సర్వీసుల పేరుతో ఎలాంటి అనధికార లైసెన్స్, అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహి స్తూన్నారని తెలిపారు.

- Advertisement -

నకిలీ జాబ్ర్స్ లేటర్లు చూపించి ప్రజల ను మోసం చేస్తున్నారని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారికి విదేశా ల్లో ఉపాధి కల్పించడం వీసా పాస్‌పోర్టు రవాణా, టూరిస్టు సేవలు కల్పిస్తామని గల్ఫ్ ఏజెంట్లు చాలా మంది ఎలాంటి గుర్తింపు లేకుండా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో లైసెన్సులేని వ్యక్తులు.. పలు సంస్థలు చట్టవిరుద్దమైన పద్దతుల ద్వారా చాలా మంది అమాయకులను మోసగిస్తు న్నారని తెలిపారు. వీరిపై అనేక క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు పేర్కొన్నారు.

అద్దెకిచ్చే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలి
గల్ఫ్ ఏజెంట్లకు ఇల్లు కిరాయి కీ, దుకాణాల సముదయాలు కిరాయికి ఇచ్చేముందు గల్ఫ్ ఏజెంటుకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ వారి దృష్టికి తీసుకు వచ్చి, పోలీసువారి అనుమతి తీసుకొన్న తరువాతనే వారికి కిరాయికీ ఇవ్వాలని సూచిం చారు. ఎవరైనా నకిలీ గల్ఫ్ ఏజెంటులు ఉన్నట్లు సమాచారం తెలిస్తే మీ దగ్గరలోని పోలీస్ వారికి తెలియజేసి సహకరించాల‌ని కోరారు.. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement