Tuesday, November 26, 2024

NZB: బోధన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

బోధన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని చేశారు. పార్టీ అధికారంలోకొస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైద్దని మాజీ మంత్రి వివరించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో బోధన్ నియోజకవర్గం జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలని ఆనాడు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ పథకాన్ని అమలు పరిచామన్నారు. సాగునీటి కొరత లేకుండా నిజాంసాగర్ కాలువలకు 500 కోట్లతో రీ మోడలింగ్ పనులను చేపట్టామన్నారు.

నిజాంసాగర్ నీరు చివరి ఆయకట్టుకు అందించి ఏర్పాట్లు ఆనాడు చేయడం జరిగిందన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఎదురైతే ఆలీ సాగర్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగునీరు అందించామని, రైతులకు కష్టాలు లేకుండా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని వివరించారు. రాష్ట్రంలో అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని, ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, బోధన్ లో కూడా ప్రజలు తనను మరొకసారి ఆశీర్వదిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందజేస్తామన్నారు. బోధన్ లో సుదర్శన్ రెడ్డికి ఆకర్షితులై ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాషా మొయినుద్దీన్, పలువార్డ్ ల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement