Saturday, September 21, 2024

NZB: ఏపీ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం..

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రభ న్యూస్) : కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం అపవిత్రం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లడ్డూ తయారీలో జరిగిన కుట్రపై విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ…. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతో ఆరాధ్యంగా పూజిస్తారని తెలిపారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని ఉపయోగించి తిరుమల తిరుపతి దేవస్థాన విశిష్టతను పాడు చేయడంపై తీవ్రస్థా యిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే ఈ లడ్డూ తయారీలో పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆరోపించారు.

- Advertisement -

లడ్డూ తయారీలో జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులు ఎంతటి వారైనా శిక్షించే వరకు త‌మ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి, ప్రవీణ్, బంటూ రామరాజు, అజయ్, రవి, సాయి, గగన్, కిషన్ ప్రసాద్, పరిరక్షణ సమితి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement