Friday, October 25, 2024

NZB: అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలి.. ప్రవీణ్ కుమార్

28న ఊర పండుగ
నిజామాబాద్ ప్రతినిధి, జులై 23(ప్రభ న్యూస్): అమ్మవారి దయతో అందరూ చల్లగా ఉండాలని సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఊరంతా మెచ్చే పండుగ వచ్చేసింది. అమ్మను కొలవడానికి ఇందూరు సర్వసమాజం సన్నద్ధమైంది. 28న ఆదివారం ఊర పండుగకు సంబంధించి మంగళవారం బండారు పోసి వేడుకలను ప్రారంభించారు. నిజామాబాద్ సర్వసమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 28న‌ నిర్వహించే జరుగబోయే ఊర పండుగలో భాగంగా మంగళవారం విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం, గాజు లపేట్ వారి ఆధ్యర్వంలో బండారు పోశారు.

ఈ సందర్బంగా అనాదిగా పెద్దల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆచారంలో భాగంగా పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా వుండాలని, పాడి పంటలు, పశు సంపద దిన దినాభివృద్ధి చెందాలని, ఏ దుష్ట శక్తులు ప్రజలపై పడవద్దని ఆ మహా తల్లులను పసుపు, కుంకుమ చల్లీ కొబ్బరికాయలు కొట్టి, కల్లు సాక పోసి, దున్నపోతును ఊరి మీద వదిలిపెట్టి మహా తల్లుల ఆశీర్వాదాన్ని కోరారు. ప్రజలందరూ సిరి సంపదలతో విలసిల్లాలనీ, ప్రతీ సంవత్సరం లాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ఉపాధ్యక్షులు పట్లే వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పాలంచ గంగాధర్, సంయుక్త కార్యదర్శి కోరడి గోపి, కోశాధికారి భైర గంగ శైలేందర్, పెద్దకాపులు కోరడి పెద్ద నర్స య్య, కోటకింది నర్సయ్య, కోర్వ భూపాల్, భైర గంగ ప్రసాద్, మల్కాయ్ లక్ష్మి నారాయణ, కొత్మీర్ సతీష్, జానకంపేట్ అశోక్, రామాడ్గు బాలకిషన్, మల్కాయి సుదర్శన్, గంట పెద్ద నర్సయ్య, సుంకటి భూమన్న, మల్కాయ్ భోజన్న, కొరడి నడ్పి నర్సయ్య, ఆదే నర్సయ్య, నరాల చక్రధర్, బెల్లల్ నాగ భూషణ్, కొట్టె సాయిబాబా, సుంకటి రమేష్, మల్కాయి మహేందర్, భైర ప్రసాద్, అన్నారం జితేందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement