Tuesday, September 17, 2024

NZB: కార్యాల‌యంలోనే తాగుడు… తూలుడు..

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 14(ప్రభ న్యూస్) : మందు బాబులం మేము.. మందు బాబులం.. మాకు మేమే మహారాజులం.. అన్న చందంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా కార్పొరేషన్ జోన్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ సిబ్బంది మద్యం సేవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ కార్యాలయంలోనే సాయంత్రం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ సిబ్బంది ఇద్దరూ మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఆకస్మికంగా కార్యాలయాన్ని తనిఖీ చేయడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.

కార్పొరేషన్ సిబ్బంది ఏకంగా కార్యాలయంలోనే మద్యం సేవించడంతో కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్ పూర్తి విచారణ చేపట్టి ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుండి తొలగించినట్లు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement