నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : భారతీయ జనతా పార్టీ అప్పగించిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. నూతనంగా ఎన్నికైన వివిధ మండలాల అధ్యక్షులు శని వారం హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో మర్యాదపూ ర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో బీజేపీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలన్నారు.
వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యం…
భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికీ శనివారం ఎంపీ అరవింద్ నివాసంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ లు నియామక పత్రాలు అందజేసారు.
ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షులు మాట్లాడుతూ… నిష్పక్షపాతంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇందూర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగుర వేయడమే తమ లక్ష్యంగా పని చేస్తామని తెలియ జేసారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూ ర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నాగోళ్ళ లక్ష్మీనారా యణ నూతనంగా ఎన్ను కోబడ్డ మండల అధ్యక్షులు నాగ రాజు, ఇప్పకాయల కిషోర్, బాలాపురం ఆనంద్ రావు, గడ్డం రాజు, తారక్ వేణు గోపాల్, మెట్టు విజయ్ కుమార్ పాల్గొన్నారు.