Friday, October 4, 2024

NZB: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలి… ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 4(ప్రభ న్యూస్) : పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి నెలకొందని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పూర్తిగా శిథిలావస్థకు చేరి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ధ్వజమెత్తారు.

శుక్రవారం నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. సామాన్యుని సొంతింటి కల సాకారం కోసం నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే మన తెలంగాణకు అవాస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి తెలంగాణాలో ఉందన్నారు.

అర్బన్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలో, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, డోర్స్, కిటికీలు, ఎలక్ట్రిసిటీ మొత్తం దొంగలు అపహ‌రించారని, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కట్టిన నిర్మాణాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ అభ్యర్థుల ఎంపిక దారిద్య రేఖకు దిగువ ఉన్నవాళ్లకు గుడిసెలు, రేకుల ఇండ్లు, కిరాయికి ఉంటున్నవారు అర్హులుగా గుర్తించాలన్నారు.

- Advertisement -

ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్ల కింద అర్బన్ నియోజకవర్గానికి 7,500 ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థలం ఉన్నవారికి కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్ధిక సహాయం కూడా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement