నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి7(ప్రభ న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న పీఎంపీల వైద్య సేవలు అభినందనీయమని, పీఎంపీలకు ఎప్పుడు అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు.
నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మ గుట్టలో కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో పిఎంపీ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్గం మోహన్ అధ్యక్షతన నిర్వహిం చిన పి.ఎం.పి అసోసియేషన్ డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్క రణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అసోసి యేషన్ డైరీ, క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా అసోసియేషన్ సభ్యులు అర్బన్ ఎమ్మెల్యే అని శాలు వాతో ఘనంగా సన్మానిం చారు. వైద్యో నారాయణ హరి అని వైద్యులు అంటే దేవుడితో సమానమని అన్నారు.