Tuesday, November 19, 2024

NZB: రక్తదానం చేసి.. ప్రాణదాతలవ్వండి..

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 14 (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదాలకు గురైన వారు, అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయానికి రక్తం దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలవ్వండని రెడ్ క్రాస్ పీఆర్ఓ రామకృష్ణ (43వ సారి రక్తదాత) కోరారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ కష్టాలను తీర్చడానికి 2016 సంవత్సరం మే 22న జిల్లా చైర్మన్ బస్సా ఆంజనేయులు, నరాల సుధాకర్, పురుషోత్తం రెడ్డి అందరి సహకారంతో ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూప్ ని వాట్సాప్ లో క్రియేట్ చేశామన్నారు. ఈ గ్రూపులో సుమారు 400 మంది సభ్యులు ఉన్నారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలని మెసేజ్ చేస్తే ఈ గ్రూపులో… ఉన్నవారు వెంటనే స్పందించి ఉచితంగా రక్తదానం చేసి వెళ్తుంటారన్నారు.

నిజామాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పసిపాపను రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాము. దీంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. కొన్ని రోజుల తర్వాత ఆ పాప పుట్టినరోజు వేడుకలకు మమ్మల్ని వారి కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించారు. నరాల సుధాకర్, రామకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మర్చిపోలేని రోజు. అలాగే రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స చికిత్స పొందుతున్నాడు. చాలా అత్యవసరంగా రక్తం కావాలని ఈ గ్రూప్ ద్వారా తెలియడంతో వెంటనే రక్తదానం చేసి కాపాడాం.. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా రక్తదానం చేయాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement