Tuesday, November 26, 2024

చదువుతోపాటు క్రమశిక్షణ అవసరం : ప్రొఫెసర్ చంద్రముఖర్జీ

బిచ్కుంద, మే 5 (ప్రభ న్యూస్) : చదువుతోపాటు క్రమశిక్షణ అవసరమని ప్రొఫెసర్ చంద్రముఖర్జీ అన్నారు. బిచ్కుంద డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలలో ఉండాలని కళాశాలకు మంచి పేరు తేవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అన్ని రంగాలలో పరిజ్ఞానం ఉంటేనే సంఘంలో మంచి పేరు, తల్లిదండ్రులకు, చదువు నేర్పిన కళాశాల, అధ్యాపకులకు పేరు వస్తుందని ఆమె అన్నారు. కళాశాలలో సాంస్కృతి కార్యక్రమాలు తోపాటు అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిడిసి మెంబర్ కోలావర్ కుమార్ సెట్, అసద్ అలీ, పూర్వ విద్యార్థులు ఆర్ శ్రీకాంత్, విట్టల్ రెడ్డి, సంగమేశ్వర్, కళాశాల అధ్యాపకులు, వైస్ ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఎం చంద్రశేఖర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement