నిజామాబాద్ సిటీ, నవంబర్ 14 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగర అభివృద్దే తమ ఎజెండా అని నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఇవాళ నిజామాబాద్ నగరం లోని 36వ డివిజన్ హమాలీవాడిలో బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ మాట్లాడుతూ… నగరంలో అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. అవినీతి ప్రభుత్వంతో ప్రజలు ఇన్ని రోజులు ఎన్నో బాధలు చూశారన్నారు. నగరంలో 9 సంవత్సరాల పాలనలో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని, వారికి అండగా నిలబడుతానన్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ది పొందారన్నారు 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణం ఇలాంటి ఎన్నో ప్రజల ముందుకు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉచిత విద్య, వైద్యంపైన ప్రతేక్ష దృష్టి పెడ్తామన్నారు. తన సేవ కార్యక్రమాలతో ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటానన్నారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకర్, అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, మురళి, బీజేపీ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు.