Friday, November 22, 2024

NZB: కాంగ్రెస్ హయాంలోనే జిల్లా అభివృద్ధి.. ధ‌ర్మ‌పురి సంజ‌య్

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 24 (ప్రభ న్యూస్) : గత బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని…దోచుకోవడం.. దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ అన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు. బుధవారం నిజాంబాద్ నగరం లోని ప్రగతి నగర్ లో గల మున్నూరు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేయడంతోనే రాక్షస పాలనను ప్రజలు బొంద పెట్టిండ్రని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.. డైనమిక్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి 6సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడన్నా రు. జీవన్ రెడ్డి డి.ఎస్.కు అత్యంత సన్నిహితుడని తెలిపారు.

జీవన్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నిజామాబాద్ జిల్లాలో భారీ మెజార్టీతో జీవన్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాం లోని మెడికల్ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా డిఎస్ ఇంటింటికి గోదావరి నీళ్లు అందిం చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. అదేవిధంగా డీఎస్ హయాంలో జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టినప్పటికీ ఎక్క డ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మరుగున పడిందన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఎంపీ ధర్మపురి అర వింద్ ఎలాంటి నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిని బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా విస్మరించిందన్నారు.

భగవంతుడికి రాజకీయాలకు సంబంధం ఏమిటి…
అసలు భగవంతుడికి రాజకీయాలకు సంబంధం ఏమిటి అని… దేవుడు పేరు చెప్పుకొని బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ అభివృద్ధి పక్కన పెట్టి రెండువర్గాల మధ్య గొడవలు పెడుతుందనీ… దేవుడు పేరు చెప్పి ఓట్లను అడగటం నైతిక కాదన్నారు. 2014 ఎంపీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు తీసుకొస్తానని ప్రజలను మోసం చేసిన విషయం విధితమే. మరోసారి 2019ఎన్నికలో పసుపు బోర్డు తెస్తానని గత ఎంపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి మోసం చేసిన ధర్మపురి అరవింద్ ఇప్పటివరకు పసుపు బోర్డు అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. పసుపు బోర్డు దిక్కు లేదు కానీ.. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని అరవింద్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎందరో క్రీడాకారులు రాణించారని అయినా ఇప్ప టికీ నిజామాబాద్ లో సరియైన క్రీడా ప్రాంగణం లేకపోవడం విచారకరమన్నారు.

- Advertisement -

నిజామాబాద్ నగర ప్రజలకు స్పోర్ట్స్ గ్రౌండ్ లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నా రు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేది లేదని పార్లమెంట్ లో కేంద్రమంత్రి చెబితే… ప్రధాని మోదీ మాత్రం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం అర్థం లేదన్నారు. నిజామాబాద్ నగరంలో విచ్చల విడిగా శివాలయాలు, రామాలయాల భూములను కబ్జా చేశారని, కబ్జాలని బీఆర్ఎస్, బీజేపీ ఆపలేకపోయారని ధ్వజమెత్తారు. భూ కబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విచారణ చేపడుతుందన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్, షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement