Friday, November 22, 2024

NZB: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి ఖాయం… ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ 16 (ప్రభ న్యూస్): బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని 24వ డివిజన్ లో గాయత్రీ నగర్ లోని గాయత్రి మందిరం నుండి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఏమి మాట్లాడారో ఆయనకే తెలియదన్నారు. నగర అభివృద్ధి అని చెప్పుకునే నేతలు ఒక్కసారి డివిజన్ లోకి వెళ్తే తెలుస్తదన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాదులో చెల్లుతదా అని ప్రశ్నించారు. అట్టడుగు ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి.. కమలం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ సేవకుడిగా మీ మధ్యలో ఉంటానన్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్, డివిజన్ నాయకులు కస్తూరి కృష్ణ, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, నాగోళ్ళ లక్ష్మి నారాయణ, శ్రీపాల్ చారి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement